Money: రైతులకు శుభవార్త.. రైతు బంధు డబ్బులు వచ్చేది ఆ రోజే..!
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే ఈ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ .10,000 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన నిధులను జమ చేసినప్పటికీ కూడా యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులను నవంబర్ లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అంతేకాదు ఎన్నికల ముందు రైతుబంధు నగదు పంపిణీ కి అనుమతి ఇవ్వకూడదని.. అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈఓ కు కూడా ఫిర్యాదు చేసింది.
అయితే రైతుబంధు ఎప్పటినుంచో అమలులో ఉన్న నేపథ్యంలో ఇదేమి కొత్త పథకం కాదని రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరికి రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఈనెల 28వ తేదీన రైతుల ఖాతాలో డబ్బు జమ కానుంది.