మని: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్లను తెలుపుతోంది. ఇటీవల ప్రభుత్వం DA ను సైతం పెంచి ఉద్యోగులకు ఆర్థికంగా కాస్త ఊరట ఇచ్చింది. ఇప్పుడు పండుగ సీజన్ ముందు కూడా బోనస్ లు సైతం చెల్లించి మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులకు మరొక శుభవార్తను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..HRA వంటివి పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జీతాలు కూడా పెరగబోవచ్చని చాలామంది ఉద్యోగస్తులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విషయాన్ని తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.


డి ఎ అనేది ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడానికి ఉద్యోగులకు సైతం వారి జీవితంలో భాగంగా చెల్లించేటువంటి డబ్బు. ఇది చాలా మంది ఉద్యోగస్తులకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సైతం జీతాలు పెంచబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..AICPI ఆధారంగా ప్రస్తుతం డిఏ 46% ఉండగా.. రాబోయే నెలలో DA 4-5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందట. ట్రావెల్ అలవెన్స్ పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ట్రావెల్ అలవెన్స్ కూడా డిఏ తో ముడిపడి ఉండడం వల్ల మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అయితే ఇది పలు నగరాలలో ఉండే కేటగిరీలను బట్టి ఉద్యోగస్తులకు పెరుగుతుందట.. అంటే 3600 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాబోయే సంవత్సరంలో హౌస్ అలవెన్స్ కూడా దాదాపుగా 3 శాతం వరకు పెంచ వచ్చని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం HRA లో మూడు శాతం వరకు పెరుగుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది కచ్చితంగా ఉద్యోగస్తులకు సైతం గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం తెలపబోతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: