Money: పండుగ వేళ ఈ చిన్న వ్యాపారాలే.. మీ ఆదాయానికి తొలి మెట్టు..!
ఆ వ్యాపారాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. విగ్రహాల దుకాణం.. దసరా , దీపావళి సందర్భంగా ప్రజలు పూజలు చేయడానికి దేవతామూర్తుల విగ్రహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ పండుగ సమయంలో మీరు విగ్రహాల తయారీ లేదా విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
గృహాలంకరణ సామాగ్రి: పండుగ అనగానే ముందుగా ఇంటిని శుభ్రం చేయడం, ఇంటిని అలంకరించడంతోనే మొదలవుతుంది. అందుకే ఇల్లు, బాల్కనీలు, ఇంటి ప్రాంగణాలను అలంకరించడానికి రంగురంగుల లైట్లు, గోడ గడియారాలు, క్యాండిల్ స్టాండ్లు , ఫోటో ఫ్రేమ్ లు, షో పీసులు ఇలా ఎక్కడ చూసినా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి మీరు వీటిని వ్యాపారంగా మొదలుపెడితే కచ్చితంగా మీ వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుంది.
పూల అమ్మకాలు:పండుగ అనగానే పూలు లేనిదే పూజ పూర్తవ్వదు. అందుకే పూలదండలు, పుష్పగుచ్చాలు వివిధ రకాల ఆకులను పూజ కోసం విక్రయించడానికి తాత్కాలికంగా మీరు పూల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఊహించని లాభం పొందవచ్చు.
బట్టల దుకాణం: పండుగ వేళ కచ్చితంగా కొత్త బట్టలు కొనడానికి పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. అందుకే మీరు బట్టల దుకాణాన్ని ఓపెన్ చేసి పండుగ ప్రారంభానికి ముందే బట్టలను అమ్మడం మొదలు పెట్టవచ్చు. ఇక ఈ ఫెస్టివల్ సీజన్లలో ఇలాంటి వ్యాపారాలు మొదలుపెట్టి మంచి లాభాలను పొందవచ్చు.