Money: ఎల్ఐసి పాలసీ పై బంపర్ ఆఫర్.. ఏంటంటే..?

Divya
సాధారణంగా పాలసీలు అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి గొప్ప ఆదాయ వనరుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పదవి విరమణ తర్వాత కూడా ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ ఎల్ఐసి పాలసీలు ప్రజలకు ఆర్థికంగా మంచి అండదండలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక జీవిత బీమా పాలసీలు చాలావరకు పొదుపు భాగంగా పనిచేస్తున్నాయి. ఇక మీరు రుణాలను పొందడానికి మీ జీవిత బీమా పాలసీలు అలాగే ఎల్ఐసి పాలసీల వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.
ఇకపోతే తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలపై అధిరే ఆఫర్ ను ప్రకటించింది. బీమా ప్లాన్ లపై ఆధారపడి అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చడానికి జీవిత బీమా పాలసీ పై రుణాన్ని పొందవచ్చు అని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ రుణాలు అనువైన రీపేమెంట్ నిబంధనలతో సహా వివిధ ప్రయోజనాలతో లభిస్తాయి. ఇక ఇతర బీమా సంస్థలు అందించే ప్లాన్లతో పోల్చుకుంటే ఎల్ఐసి జీవిత బీమా ప్లాన్ లు లోన్ ఎలిజిబిలిటీ కాంపోనెంట్ తో వస్తాయి..

రుణ గ్రహీతలు ఎల్ఐసి పాలసీ సరెండర్ విలువలో 90 శాతం వరకు లోన్ పొందవచ్చు. ఉదాహరణకు మీ బీమా పాలసీ సరెండర్ విలువ రూ .5లక్షల అయితే అందులో రూ.4.5 లక్షల వరకు మీరు లోన్ పొందుతారు ఇక ఈ లోన్ పై సంవత్సరానికి 10 శాతం వడ్డీ రేటు తో రుణాలను చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు రిపేమెంట్ పదవీకాలం , మోడ్ కూడా అనువైనవి. ఇక వీటి వల్ల లాభాలు ఏమిటి అంటే పర్సనల్ లోన్లతో పోలిస్తే చాలా ఎక్కువ లోన్ ఇక్కడ పొందవచ్చు. అత్యంత సురక్షితమైన రుణాల కంటే తక్కువ వడ్డీ రేట్లు. పైగా మెచ్యూరిటీ మొత్తం నుంచి లోన్ బ్యాలెన్స్ సెటిల్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: