Money: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
ఈ కొత్త పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటు తో మొదటిసారి ఒక రూ.1 లక్ష లోన్ పొందే అవకాశం ఉంటుంది. రెండో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కుమ్మరులు, చెప్పులు కు, నేతకారులు, శిల్పులు, స్వర్ణకారులు, తాపీ పని చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు అంతా కూడా ఈ పథకం కింద లాభం పొందవచ్చు.
అంతేకాదు ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు రూ.500 ఉపకార వేతనంతో పాటు మెరుగైన శిక్షణను కూడా అందిస్తారు. ఇక శిక్షణ పూర్తయిన తర్వాత పరికరాలను కొనుగోలు చేయడానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు. వీటితోపాటు పీఎం ఈ బస్ సేవా పథకానికి కూడా కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం రూ.57,613 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించగా పదివేల బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా 169 పట్టణాలలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి ఈ పథకం కింద బస్సు సేవలకు రూ.10వేల వరకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలుస్తోంది.