Money: ఇంటి వద్దే సంపాదించాలనుకునే మహిళలకు శుభవార్త..!

Divya
ప్రస్తుతం మహిళలు ఇంటి వద్దనే ఉంటూ చక్కటి వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో మీకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. దీని వల్ల మీరు మంచి ఆదాయాన్ని పొందడమే కాదు మీతో పాటు మరో నలుగురు మహిళలకు కూడా ఆర్థికంగా అండగా నిలబడవచ్చు. ఇక తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఈ వ్యాపారాన్ని సంవత్సరం మొత్తం చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఇక ఆ బిజినెస్ ఏమిటంటే గరం మసాలా తయారీ.. భారతీయ వంటల్లో సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసులలో గరం మసాలా పొడి కూడా ఒకటి.. నాన్ వెజ్ మొదలుకొని వెజ్ ఐటమ్స్ వరకు దాదాపు అన్ని వంటల్లో కూడా ఈ గరం మసాలా పొడిని ఉపయోగిస్తూ ఉంటారు. మనం తయారు చేసే వంటకు రుచి రావాలి అంటే తప్పనిసరిగా ఈ గరం మసాలా ఉపయోగించాల్సిందే. ముఖ్యంగా ఇళ్లతో పాటు కర్రీ పాయింట్స్,  హోటల్స్ ,క్యాటరింగ్ సర్వీసులు అందించేవారు కూడా ఈ మసాలాను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లో కూడా ఈ గరం మసాలా కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మీరు దీనినే వ్యాపారంగా మార్చుకొని చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.
ఇక ఈ గరం మసాలా పొడి తయారీకి కావలసిన మసాలా దినుసులలో ధనియాలు , మిరియాలు, ఏలకులు, జీలకర్ర ,మెంతిపొడి, షాజీరా, జాజికాయ, జాపత్రి , లవంగాలు వీటిని సమపాళ్లల్లో ఒక ఫార్ములా ప్రకారం పొడి చేసి గరం మసాలా పొడిని తయారు చేయవచ్చు. సంవత్సరాలు తరబడి నిలువ ఉండే ఈ పొడి మీకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. ఇక ముడి సరుకులను పొడి చేయడానికి మిక్సీ అయినా వాడవచ్చు లేదా పిండి మిల్లు మిషన్ అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్యాకేజింగ్ కోసం ప్రత్యేకంగా ఒక మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక హోల్సేల్ మార్కెట్లతో మీరు ఒప్పందం తీసుకుంటే మీరు తయారు చేసిన ఈ గరం మసాలాను విక్రయించి మంచి ఆదాయం పొందవచ్చు. మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీరు మరో నలుగురు మహిళల సహాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: