Money: ఏపీ సర్కార్ శుభవార్త.. ప్రతి నెలా వారికి రూ.10 వేలు..!

Divya
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకొని దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు శుభవార్త తెలిపింది. రూ.10వేల లోపు ఉన్న అర్చకుల వేతనం ఇప్పుడు 10 వేల రూపాయలుగా నిర్ణయించి శుభవార్త ప్రకటించడం గమనార్హం .ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయి అని ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా దేవాలయాలల్లో పనిచేసే అర్చకుల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపునకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.  మరొకవైపు దేవాలయాల్లో సాంకేతిక సిబ్బంది కొరత ఉంది అని ఆయన అంగీకరించారు. అయితే ఆ కొరతను అధిగమించడానికి పలు రకాలు చర్యలు తీసుకుంటామని.. మరోవైపు  ఇప్పటికే రాష్ట్రంలో కేటగిరి వన్ దేవస్థానాలలో  పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం కింద రూ.15,625 చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక కేటగిరి టు విభాగంలో పనిచేస్తున్న అర్చకులకు గౌరవ వేతనం రూ.10,000 ఇస్తూ వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు అర్చకులకు 100% వైద్య ఖర్చులు కూడా భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పటివరకు రూ.10వేల లోపు గౌరవ వేతనం అందుకుంటున్న అర్చకులకు కూడా నెలవారి జీతం రూ . 10,000 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.  దీంతో రాష్ట్రంలో ఉన్న 1,146 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది అని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. నిత్యం భగవంతుడికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం కింద రూ.పదివేలు నెలవారి జీతం పెంపొందించడం పై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: