Money: ఎల్ఐసి సరికొత్త పాలసీ.. హామీ తో కూడిన రాబడి గ్యారంటీ..!

Divya
దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది.అదే ధన్ వృద్ధి పాలసీ.. ఈ పథకంలో బీమా చేసిన వ్యక్తికి భీమా రక్షణతో పాటు గ్యారంటీ రిటర్న్ కూడా లభిస్తుందని చెప్పవచ్చు.  ఇది ఒకే ప్రీమియం కాబట్టి జీవిత బీమా పథకం అని చెప్పాలి. నాన్ లింక్డ్ , నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తుల కోసం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. ఈ ధన్ వృద్ధి పాలసీ జూన్ 23 2023న ప్రారంభించబడింది.

ఇకపోతే ఈ పాలసీని కొనుగోలు చేయడానికి కంపెనీ ప్రస్తుతం 2023 సెప్టెంబర్ 30న చివరి తేదీన ప్రకటించడం జరిగింది. ఇకపోతే మీరు ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకోండి.. తాజాగా ఎల్ఐసి అందించిన సమాచారం ప్రకారం వ్యక్తిగత, పొదుపు, సింగిల్ ప్రీమియం లైఫ్ ప్లాన్.. ఇది రక్షణ మరియు పొదుపు కలయికలను ఖాతాదారుడికి అందిస్తుంది. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల భీమా రక్షణతో పాటు హామీ తో కూడిన ప్రయోజనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పాలసీ అమలులో ఉన్నప్పుడే పాలసీదారుడు మరణించినట్లయితే ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు.

ఒకవేళ అదే సమయంలో మెచ్యూరిటీ అనేది పూర్తయిన తర్వాత గ్యారెంటీ మొత్తం ఇవ్వాలన్న నిబంధన కూడా ఇక్కడ అందుబాటులో ఉంచబడింది. అందుకే పాలసీ మెచ్యూరిటీపై కూడా గ్యారెంటీ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక 10,  15 , 18 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిలో ఈ పాలసీకి కస్టమర్ కనీసం 90 రోజుల వయసును కలిగి ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఈ పాలసీకి కనీస హామీ మొత్తం రూ.1.25 లక్షలు. దీని తర్వాత మీరు 5000 రూపాయల వరకు పెంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం పాలసీకి హామీతో కూడిన రాబడి జోడించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: