Money: మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ప్లాన్..!
ముఖ్యంగా మహిళలను, బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు మోడీ ప్రభుత్వం ఇలా ముద్ర లోన్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 10 లక్షల రూపాయల వరకు మీరు లోన్ పొందవచ్చు.. ఇకపోతే ప్రస్తుత కాలంలో మగ్గం వర్క్ చేయించుకోవడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. చాలా మంది పెళ్లిలను మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్ల వరకు చీరలపైన, జాకెట్ల పైన మగ్గం వర్క్ వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మగ్గం వర్క్ కు మంచి డిమాండ్ ఉంది.
ఈ వర్క్ చేయించుకోవడానికి పనితనం ఉన్న కార్మికులు చాలా మొత్తంలో వసూలు చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. అయితే మీరు కూడా ఈ మగ్గం వర్క్ నేర్చుకుంటే కేవలం కొన్ని రోజుల్లోనే మీరు వేలల్లో ఆదాయం పొందవచ్చు. దీనికోసం మీరు ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈ మగ్గం వర్క్ ఎక్కడ నేర్పిస్తారు అనే విషయాన్నికొస్తే ముఖ్యంగా తెలంగాణ ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థలో ఈ మగ్గం వర్క్ కు సంబంధించిన కోర్సు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో చదువుతో సంబంధం లేకుండా మీరు కేవలం 1500 రూపాయలను ఫీజు కింద కడితే చాలు మీకు ఈ వర్క్ వారు నేర్పిస్తారు.పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 040-24143728 అనే నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.