మనీ: ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త..!

Divya
ప్రస్తుతం ఆర్బిఐ వడ్డీరేట్లు పెంచడంతో ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు ఫిక్స్ డిపాజిట్ లపై ఎక్కువ వడ్డీని చెల్లించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వివిధ కాలాల ఫిక్స్డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచుతూ కస్టమర్లకు ఆర్థికంగా భరోసా కలిగిస్తున్నాయి. ఇకపోతే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐ కూడా ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచుతూ మరొకసారి నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజెన్లకు 7.25% వరకు వడ్డీ లభిస్తుండగా సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.75% వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా ఎస్బిఐ వీ కేర్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజనులకు అదనంగా ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ పథకం గడువు 2023 మార్చి 31 వరకు పొడిగించగా కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఎస్బిఐ వీ కేర్ డిపాజిట్ ఎస్బిఐ సీనియర్ సిటిజన్లో కోసం ఒక ప్రత్యేకమైన పథకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకంలో మీరు రూ.5లక్షల డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల మెర్క్యూరిటీపై రూ.7,16,130 లభిస్తుంది అంటే వడ్డీ ఆదాయం సుమారుగా రూ.2,16,130.. ఇక ఈ పథకంలో 050% కాకుండా 0.30% అంటే మొత్తం 0.80% ఎక్కువ వడ్డీని.. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ఫిక్స్ డిపాజిట్ లపై సీనియర్ సిటిజెన్లకు అందరికీ అందిస్తోంది. ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ లపై కూడా ఈ వడ్డీ పొందవచ్చు.
అంతేకాదు ఫిక్స్ డిపాజిట్ పై  సెక్షన్ 80 సి కింద పండు మినహాయింపు పొందుతారు సుమారుగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 10 సంవత్సరాల వరకు మీరు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు ముఖ్యంగా ఎస్బిఐ దాని ఉద్యోగులు పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న ఫిక్స్ డిపాజిట్లు రేట్ల కంటే ఒక శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: