మనీ: అధికంగా వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్ లు ఇవే..!

Divya
ఇటీవల కాలంలో ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక మాంద్యం, భయాలు, వాతావరణం , ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో? తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో అందరూ కూడా తగినంత మొత్తంలో పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పథకం బెస్ట్ ఆప్షన్ అనేది ఎదుగుతున్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడూ కూడా ఉత్తమమైన పొదుపు మార్గం అని చెప్పవచ్చు. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలపై 7.0% నుంచి వడ్డీని అందిస్తాయి. అయితే ఫిక్స్ డిపాజిట్ చేయడానికి ఏ బ్యాంకులు అనువైనవి? వేటిలో ఎక్కువ వడ్డీ లభిస్తుంది? అనేది ఇప్పుడు చూద్దాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్:
ప్రభుత్వ బ్యాంకుల్లో ఎనిమిది శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంక్ ఏదీ లేదు.  కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్లో 666 రోజుల ఫిక్స్ డిపాజిట్ పై 8.05% వడ్డీ రేటును అందిస్తుంది. అదే కాల పరిమితికి సీనియర్ సిటిజనులకు 7.75% వడ్డీ రేటును ఇస్తోంది. ఇది కూడా తక్కువేమీ కాదు అని చెప్పవచ్చు.  అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే మెచ్యూరిటీ పీరియడ్ 666 రోజులు మాత్రమే. ఇకపోతే వచ్చే రెండు సంవత్సరాలలో వడ్డీ రేట్లు తగ్గితే దీనిలో మార్పు కనిపించే అవకాశం కూడా ఉంది.
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్:
ఆకర్షణీయమైన డిపాజిట్ రేట్లు ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి. కొంచెం ఎక్కువ కాల పరిమితితో తీసుకుంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.  18 నెలల ఒక రోజు నుండి మూడు సంవత్సరాల డిపాజిట్ పై సాధారణ పౌరులకు 7.5% వడ్డీ , సీనియర్ సిటిజనులకు 8 శాతం వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తోంది. ఇక్కడ రూ.5  లక్షల వరకు డిపాజిట్ లపై బీమా సౌకర్యం కూడా ఉంటుంది. మూడు సంవత్సరాల కాల పరిమితితో ఫిక్స్ చేయాలని భావిస్తే ఈ బ్యాంక్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

వీటితోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 700 రోజుల కాల వ్యవధితో డిపాజిట్ చేసిన వారికి 7.25% వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: