మనీ: ఇంట్లో ఉంటూనే ఈ వ్యాపారంతో మీ ఆదాయం రెట్టింపవడం ఖాయం..!

Divya
కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని చెప్పవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియా తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ బిజినెస్ తో మరింత లాభం పొందవచ్చు. అదే స్నాక్స్ తయారీ బిజినెస్. ఇటీవల కాలంలో బాగా ఆదరణ పొందిన బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి. క్వాలిటీ , రుచి మెయింటైన్ చేస్తే డబ్బులు రావడం గ్యారెంటీ.. ముఖ్యంగా ఈ బిజినెస్ ను తక్కువ పెట్టుబడితో.. తక్కువ మాన్ పవర్ తో తక్కువ స్థలంలో ప్రారంభించి ఆ తరువాత మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
ఇటీవల కాలంలో చాలామంది డోర్ డెలివరీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మీరు మీ చుట్టుపక్కల ఉండే ఇళ్లకు డోర్ డెలివరీ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో ఎవరికైనా పిండి వంటలు తయారు చేయడం వచ్చి మీకు సహకరించడానికి వారు ఆసక్తిగా ఉంటే ఈ వ్యాపారం నిర్వహించడం చాలా సులభం అవుతుంది. లేదంటే పిండి వంటలు చేసే వారిని కూడా మీరు నియమించుకోవచ్చు. వారికి ప్రతి నెల జీతం ఇవ్వచ్చు లేదా వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకోవచ్చు.
అయితే పెద్ద తరహాలో బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ప్రభుత్వం తరఫున అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్తో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా మీకు అన్ని రకాల పిండి ,నూనె , శనగపిండి, ఉప్పు, మసాలాలు, వేరుశనగలు , పప్పులు మీకు అవసరం అవుతాయి. రకరకాల రుచికరమైన వంటలను తయారు చేసి మంచి లాభం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: