మనీ: ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు శుభవార్త..!
ఆడపిల్ల పుట్టినప్పటినుంచి ఆమెను అత్తవారింటికి పంపించే వరకు ప్రతి విషయంలో కూడా డబ్బు చాలా అవసరమవుతుంది. అలాంటప్పుడు ఆమె పుట్టినప్పుడే ఆమె పేరు మీద డిపాజిట్ చేయడం మొదలుపెడితే.. అనతి కాలంలోనే ఆమె భవిష్యత్తుకు భరోసాను అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి స్కీం పథకాన్ని అందిస్తుంది. ఇందులో చేరడం వల్ల అమ్మాయి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించవచ్చు. అంతేకాకుండా మరో బెనిఫిట్ ఏంటంటే పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో చేరాలనుకునేవారు దగ్గర్లో ఉన్న బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకంపై ఖాతా తెరవచ్చు. 250 రూపాయలతో ఖాతా తెరిచి.. పాప బర్త్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు , తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాప ఫోటోలు కూడా ఇవ్వాలి. ఈ పథకంలో చేరిన వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5లక్షల వరకు డబ్బు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకేసారి డబ్బులు కట్టవచ్చు లేదా ప్రతినెల కొంత మొత్తం లో చెల్లించవచ్చు. అయితే పదేళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 7.6% వడ్డీ కూడా లభిస్తుంది. 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అమ్మాయికి 21 సంవత్సరం వచ్చిన తర్వాత డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు పైన మీ విత్ డ్రా డబ్బు ఆధారపడి ఉంటుంది.