మనీ: నేటి నుంచి వారికి లక్ష రూపాయలు అందించే పథకం ప్రారంభం..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి కోసం ఎప్పటికప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త కొత్త పథకాలతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక గతంలో ప్రకటించిన వారికి సైతం విరామం లేకుండా విడతల వారిగా నిధులు విడుదల చేస్తూనే ప్రజల ఆశీస్సులు కూడా పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు పథకాలకు శ్రీకారం చేపడుతున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వైయస్సార్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫాలను ప్రారంభిస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు,  వైయస్సార్ షాదితోఫా వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ పథకాల ద్వారా కేవలం పేద ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించడమే కాదు.. పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాల నివారణ పాఠశాలల్లో చేరికలు శాతం పెంచడం అలాగే డ్రాప్ అవుట్ రేటును తగ్గించడం ఈ కారణాలతో పాటు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతున్న పేద తల్లిదండ్రులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపోతే దరఖాస్తు చేసుకునే వధూవరులు ఇద్దరికీ టెన్త్ క్లాస్ ఉద్యోగం తప్పనిసరి చేశారు. మీకు అలా చేయడంతో పిల్లల చదువులు ప్రోత్సహించడం బాల్య వివాహాలను నివారించడం జరుగుతుంది.
ఇకపోతే వైయస్సార్ కళ్యాణమస్తు,  వైయస్సార్ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే ఈ పథకాలకు సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెబ్సైటును ప్రారంభించారు.  ఇక నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన పథకాలకు 6 దశలలో తనిఖీలు ఉంటాయని సమాచారం. ఎస్సీ, ఎస్టీ,  బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు,  ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. SC, st కులాల వారికి కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు.. బీసీలకు రూ.50,000.. వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక మైనారిటీలకు లక్ష రూపాయలు,  దివ్యాంగులు అయితే రూ.1.5 లక్షలు,  భవన నిర్మాణ కార్మికులకు రూ.40, 000 ప్రభుత్వ సహాయం కళ్యాణమస్తు కింద లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: