మనీ: ఎల్ఐసి నుంచి బెస్ట్ ప్లాన్.. ప్రతి నెల రూ.18,500 ..

Divya
ఎల్ఐసి ద్వారా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండడానికి ప్రధానమంత్రి వయో వందన యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దీంతో సీనియర్ సిటిజన్స్ చాలామంది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కీంను పొందడంలో విఫలం అవుతున్నారు. ఇక ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం అనేది ఒక సామాజిక భద్రత కల్పించే పథకం. ఇందులో నెల నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి భార్యాభర్తలిద్దరికీ కూడా 60 సంవత్సరాల వయసు దాటి ఉండాలి.
గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో భార్యాభర్తలిద్దరూ కలిపి రూ. 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్ పై మీకు 7.40% వడ్డీ కూడా లభిస్తుంది.  ఇక సంవత్సరానికి మీకు రూ.30 లక్షలకు గాను రూ.2,22,000 వడ్డీ లభిస్తుంది.. అంటే ఈ మొత్తాన్ని మీరు నెలకు రూ.18,500 ను  పెన్షన్ రూపంలో పొందవచ్చు.  ఇకపోతే ఈ స్కీమ్లో భార్యాభర్తల్లో ఒక్కరే చేరినా రూ. 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సంవత్సరానికి రూ.1,11,000 పొందుతారు అంటే నెలకు లబ్ధిదారుడు ఈ వడ్డీని రూ.9,250 పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీం యొక్క కాలపరిమితి 10 సంవత్సరాలు 2023 మార్చి 31 ఇందులో చేరడానికి చివరి రోజు.

ఒకవేళ ప్రమాదవశాత్తు 10 సంవత్సరాలలోపు లబ్ధిదారుడు మరణిస్తే ఈ స్కీమ్లో పెట్టిన  పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇక పథకంలో గడువు ఉన్నంత వరకు పెట్టుబడి పెడితే పెన్షన్ తో పాటు మొత్తాన్ని కూడా కలిపి ఇస్తారు. 2017లో జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రధానమంత్రి వయో వందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎల్ఐసి అందిస్తున్న ఈ ప్లాన్ వృద్ధులకు మరింత ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: