మనీ: కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న ఎస్బిఐ.. పూర్తి వివరాలివే..!

Divya
దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం సరికొత్త శుభవార్తను తీసుకొచ్చింది. ఇక ఎస్బిఐ క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇక మీరు కూడా ఎస్బిఐ యొక్క క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే దానిని ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మరి కొనుగోలు చేసినట్లయితే 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా ఎంపిక చేసిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి గరిష్టంగా రూ.10,750 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది..
ఇక ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా అమెజాన్లో గ్రోసరీ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఖర్చుపై రూ.300 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ.2500 ఉంటుంది. ఇక మొబైల్ పై కూడా మంచి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా ఫోన్ కొనుగోలపై తగ్గింపు పొందాలి అంటే కనీసం ట్రాన్సాక్షన్ రూ.5000 ఉంటే మీకు తప్పకుండా మరింత ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది. ఇక నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1250 వరకు తగ్గింపు ఉంటుంది. అదే ఈఎమ్ఐ లావాదేవీలపై గరిష్టంగా రూ.1500 తగ్గింపు ఉంటుంది. రూ. 30,000 లేదా ఆపైన విలువైన లావాదేవీలు నిర్వహిస్తే రూ. 1500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
ఇక రూ.50,000 లేదా అంతకంటే విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని కేటగిరీలు మీరు కలుపుకుంటే ఈ ఆఫర్ పీరియడ్లో ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా ₹10,750 తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎస్బిఐ అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: