మనీ: రైతులకు శుభవార్త తెలిపిన కేంద్రం.. పీఎం కిసాన్ కోసం కొత్త నెంబర్ ఏర్పాటు..!!

Divya

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రైతులకు ఆసరాగా ఉండేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా మంచి రాబడిని పొందే విధంగా కేంద్రం రూపొందిస్తుంది. రైతులకు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాల్లో సమ్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఇక ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ 6000 చొప్పున ఉన్న విషయం తెలిసిందే.  ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడుదలలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 11వ విడత డబ్బులు అందుకోవడం జరిగింది. ఇప్పుడు 12వ విడత రానున్న నేపథ్యంలో ఈ నెల ఆఖరిలోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

ఇక ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను కూడా కేటాయించింది. ఇక ఈ నెంబర్ల ద్వారా రైతులు పూర్తి సమాచారాన్ని తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అయితే అగ్రికల్చర్ ఇండియా తన అధికారిక ట్వీట్ లో దేశంలోని రైతులు పీఎం కిసాన్ యోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఒక నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ముందుగా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు తమ దరఖాస్తు యొక్క స్థితిని తెలుసుకోవడానికి 155261 మనీ నంబర్కు కాల్ చేయడం వల్ల దరఖాస్తు స్థితితో పాటు ఇన్స్టాల్మెంట్ అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు.

ఇకపోతే ముందుగా అధికారి వెబ్సైటుకు వెళ్లాలి. ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ను ఎంచుకొని, బెనిఫిషనరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి . అప్పుడు మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్,  ఆధార్ నెంబర్ ఏదైనా ఒకదానిని ఎంచుకొని తర్వాత మీ అకౌంట్ కు డబ్బులు వస్తుందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: