మనీ: ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్ విషయంలో జాగ్రత్త తప్పనిసరి.. లేదంటే..!

Divya
నిజానికి ప్రైవేటు రంగంలో పనిచేసే వ్యక్తులు ఎప్పటికప్పుడు ఏ కంపెనీలో అధిక శాలరీ ఇస్తే ఆ కంపెనీకి మారుతూ ఉంటారు. ఇక ఈ సమయంలో కూడా అన్ని రంగాలలో రిక్రూట్మెంట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చాలామంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇక మీరు కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. లేదంటే మీరు నష్టాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నిజానికి ఉద్యోగం నుండి రాజీనామా చేసిన తర్వాత మీరు మీ పిఎఫ్ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు చేయకుంటే .అది కొంత సమయం వరకు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ లావాదేవీ లేకుండా ఖాతాలో పేర్కొన్న నిడివి తర్వాత డిపాజిట్ పై సంపాదించిన వడ్డీ కి పన్ను పడే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఉద్యోగం వదిలిపెట్టిన చాలామంది తమ పిఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం పై వడ్డీ పెరుగుతూనే ఉంటుందని,  మూలధనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తారు. అయితే ఇది నిర్ణీత కాలానికి మాత్రమే జరుగుతుందని గుర్తించాలి.
ఇకపోతే ఉద్యోగం నుండి రాజీనామా చేసిన తర్వాత మొదటి 36 నెలల పాటు ఎటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయకపోతే ఇక ఈపీఎఫ్ ఖాతా ఇన్ ఆపరేటివ్ ఖాతా కేటగిరిలో మీ ఖాతాను ఉంచబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఖాతాను ఉంచకుడదు అనుకుంటే.. మూడు సంవత్సరాల లోపు కొంత డబ్బు విత్ డ్రా చేసుకోవడం మంచిది. ఇకపోతే 55 సంవత్సరాల వయసు వరకు నిష్క్రియంగా మాత్రం ఉండదు. ఒకవేళ నిబంధనల ప్రకారం కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని మీరు జమ చేయకపోతే పీఎఫ్ ఖాతా నిష్క్రయం కాదు కానీ ఈ కాలంలో వచ్చే వడ్డీకి పన్ను కూడా వర్తిస్తుంది. అంతేకాదు 7 సంవత్సరాల పాటు నిష్క్రియంగా ఉన్న తర్వాత కూడా మీరు పిఎఫ్ ఖాతాను క్లైమ్ చేయకపోతే ఆ డబ్బు మొత్తం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ కి వెళ్లిపోతుంది.
ముఖ్యంగా ఈపీఎఫ్ ,ఎంపీ చట్టం 1952లో సెక్షన్ 17 ద్వారా మినహాయించబడిన ట్రస్టులు కూడా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ నియమాల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి .అందుకే ఉద్యోగం మారితే వెంటనే పిఎఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను యాక్టివ్గా ఉంచడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

EPF

సంబంధిత వార్తలు: