మనీ: కొత్త ఇంటిని కొనేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి..!!

Divya
భూమి మీద జీవించే ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఆదా చేయడం చేస్తూ ఉంటారు. ఇక పెద్దలు ఇల్లు కట్టి చూడు ..పెళ్ళి చేసి చూడు.. అనే సామెతను  ఊరికే చెప్పలేదు. ఈ రెండు కూడా ఎంత కఠినమైవో.. కష్టతరమైనవో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈ రెండు సందర్భాలలో మనం పెట్టిన డబ్బు ఖర్చు అవుతుంది తప్ప తిరిగి రాదు అనడానికి ఈ సామెత చాలా చక్కగా సెట్ అవుతుంది. ముఖ్యంగా ఈ రెండింటి వెనుక శ్రమ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యుడు తన కలను నెరవేర్చుకోవడం అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది .ఇక బ్యాంకులను ఆశ్రయించి లోన్ ద్వారా తమ సొంత ఇంటి కలను చాలామంది నెరవేర్చుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా బ్యాంకు ద్వారా లోన్ పొంది సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తే ఈ అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి.
ముఖ్యంగా మీ ఆర్థిక స్థితిపై మీకు అవగాహన ఉండాలి.. ఇక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు మీ ఆర్థిక స్థితిని అలాగే పేమెంట్లు, ఈ ఎమ్ ఐ ల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇక మీకు ఎంత ఆదాయం వస్తోంది.. ఇంటికి ఎంత ఖర్చు అవుతోంది తదితర వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఎమ్ ఐ ఎంత ఉండాలనేది ప్లాన్ చేసుకోవాలి. ముందుగా ఎన్ని సంవత్సరాలు ఈఎంఐ చెల్లించాలి.. అప్పటి వరకు మనం ఖర్చులను ఎలా నియంత్రించాలి అనే విషయాలను అంచనా వేసుకున్న తర్వాతనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.
ఇక క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా 750 కంటే ఎక్కువ ఉండాలి. ఇక అప్పుడే మీకు లోన్ లభిస్తుంది. అంతే కాదు బ్యాంకు ను  సంప్రదించే ముందు మీరు ఇప్పటికే ఏదైనా రుణాలు, ఈ ఎమ్ ఐ తీసుకొని ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం మంచిది. ఇక ఆ తర్వాత మీ ప్రాపర్టీ కి అవసరమైన ధృవీకరణ పత్రాలు, ఇంక్యుబేషన్ సర్టిఫికెట్, టైటిల్ డీడ్ వంటివి కచ్చితంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా హోమ్ లోన్ తీసుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: