మనీ: నెలకు రూ.2 వేల చొప్పున ఇన్వెష్ట్ చేస్తే చాలు.. నెలకు రూ.25 వేల పెన్షన్..!!

Divya
ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే.. ప్రైవేటు, చిన్న, సన్నకారు ఉద్యోగులు రిటైర్ అయ్యాక పెన్షన్ పొందడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ప్రతి నెల పెన్షన్ పొందే వీలు కల్పిస్తోంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకం.. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న పథకం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితమైన రాబడిని పొందవచ్చు. ఇక ఈ పాలసీ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. భవిష్యత్తులో రిటైర్మెంట్ కోసం ముందు నుంచి దాచుకునే సౌలభ్యాన్ని కల్పించడానికి ఏర్పాటు చేయబడినదే ఈ ఎన్ పి ఎస్ పథకం. ఇక ఎవరైనా సరే క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టి రిటైర్మెంట్ వయసు తర్వాత ప్రతి నెలా కొంత మొత్తాన్ని మీరు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం, పి ఎఫ్ ఆర్ డి ఎ సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఉదాహరణకు మీ వయసు 25 సంవత్సరాలు అనుకుందాం .. ప్రతినెలా మీరు రెండు వేల రూపాయల చొప్పున నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకంలో జమ చేస్తున్నట్లు అయితే మీకు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పథకంలో  చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అంటే 40 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు ప్రతి ఏటా కనీసం పది శాతం రాబడి వస్తుందని చెప్పవచ్చు. ఇక మీకు 65 సంవత్సరాలు వచ్చే నాటికి మీరు పెట్టబడిన పెట్టిన మొత్తం రూ.9.60 లక్షలు అవుతుంది. కానీ వడ్డీతో కలిపి రూ.1.27 కోట్లు అవుతుంది.
ఇక మీరు ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. కేవలం 40% అన్నిటిని కొనుగోలు చేసి దానిపై కనీసం ఏడు శాతం ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇప్పుడు మీరు ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నెల 25 వేల రూపాయలను పొందే అవకాశం ఉంటుంది. ఇక సెక్షన్ 80సి కింద రెండు లక్షల రూపాయల వరకు గరిష్ఠంగా ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభించడం గమనార్హం.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: