ఈ తప్పులు చేస్తే... వారింట్లో లక్ష్మీదేవి నిలవదు ?

VAMSI
లక్ష్మీ దేవి తమ ఇంటికి రావాలని ఎవరికి ఉండదు. ఇలాగే చాలా మంది ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంటి విషయంలో.. అలాగే ఇల్లు నీటుగా ఉంటేనే లక్ష్మీ దేవి వస్తుందని మరి కొంత మంది ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకొంత మంది కొన్ని కొన్ని సమయాలలో పసుపు, కుంకుమ బయటకు వెళ్లనివ్వరు. ఇలాంటి చాలా కట్టబాట్లను చాలా మందే ఫాలో అవుతుంటారు. అయితే కొన్ని కొన్నిసమయాలలో మనం చేసే అతి జాగ్రత్తలు, పొరపాట్ల వలన లక్ష్మీ దేవి అనుగ్రహం పొందలేము. మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ప్రతీ రోజు ఇంటిని శుభ్రం చేయడం వలన కూడా లక్ష్మీ దేవి ఇంటి నుంచి పోయే అవకాశం కూడా ఉంది. అందువలన ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఇంటిని తడి బట్టతో తుడవడం ఆపేసి కేవలం సోమ, బుధ, శుక్ర, శని ఈ నాలుగు వారాల్లోనే తుడవడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కచ్చితంగా కలుగుతుంది. అలాగే సూర్యాస్తమయం అయ్యాక ఇంటిని అసలు శుభ్రం చేయకూడాదు, అలా కాకుండా ఒక వేళ శుభ్రం చేస్తే చెత్తను మాత్రం బయట వేయకూడదు. అలా వేయడం వలన లక్ష్మీ దేవి ఇంటి నుండి  బయటకు వెళ్లే ఛాన్స్ ఉందంట.
ఇంకా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆరు బయట అసలు ఊడవకూడదు. అయితే ఒక వేళ ఊడ్చినా వాకిలి మొత్తం కాకుండా కొంత వరకే ఊడ్చుకోవాలంట. ఆలా కాదని  మొత్తం ఊడవడం వలన కూడా లక్ష్మీ దేవి బయటకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదట. ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఎవరైనా తమ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రధాన ద్వారం నుంచి మొదలెట్టి ఇంటి మొత్తం శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి  ఎంట్రీ ఇచ్చేది ప్రధాన ద్వారం నుంచే వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: