మనీ: రూ.5 వేల లోపు ప్రీమియం తో రూ.50 లక్షలు లాభం.. ఎలా అంటే..?

Divya
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక ఎందుకంటే.. ఎప్పుడు.. ఏ క్షణాన ప్రాణం ఎలా పోతుందో తెలియదు కాబట్టి.. కనీసం కుటుంబ సభ్యులైన బాగుండాలనే నేపథ్యంతోనే చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. ఎల్ఐసి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా మంచి పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.5000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేరు వేరు వర్గాలకు సంబంధించిన వేరు వేరు ఎల్ఐసి పాలసీ లను కూడా అందించడం జరుగుతోంది. ఇక అలాంటి పాలసీలలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ అందించడం జరిగింది.
నాన్ లింక్డ్, వితౌట్ ప్రాఫిట్, ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ ఈ పాలసీ లలో రెండు రకాల డెత్ బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి. అయినప్పటికీ కూడా ఒక పాలసీ లెవెల్  సమ్ అస్యూర్డ్ ఆప్షన్ కాగా మరొకటి సమ్ అష్యూర్డ్. ఇకపోతే పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చూస్తోంది ఎల్ఐసి. ముఖ్యంగా పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠంగా  65 సంవత్సరాలు ఉండవచ్చు. మెచ్యూరిటీ నాటికి గరిష్ఠంగా 80 ఏళ్ల వయసు ఎంచుకునే అవకాశం కల్పించబడింది.. ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీలో గరిష్టంగా 10 లక్షల రూపాయల చొప్పున సమ్ అష్యూర్డ్ పెంచుకోవచ్చు.

ఇకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదని చెప్పవచ్చు. ఇందులో పాలసీ హోల్డర్లకు మరణిస్తే నామినేట్ కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక పాలసీ గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అయితే లభించదు. ఉదాహరణకు రూ.50లక్షలకు 20 సంవత్సరాల తర్వాత లెవెల్ సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలి అంటే 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 4356.. జిఎస్టి తో కలిపి సంవత్సరానికి 48,928 రూపాయలు చెల్లించాలి. సంవత్సరాలను బట్టి ప్రీమియం కూడా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: