మనీ: కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పీఎం గుడ్ న్యూస్..!

Divya
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా వారి శవాలను కాల్చడానికి కూడా ప్రదేశం లేనంతగా ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చింది. ఇక అలాంటి దుర్ఘటన సందర్భాలు మళ్ళీ రాకూడదని ఇప్పటికీ ఎంతోమంది కోరుకుంటున్నారు. ఇకపోతే కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు మరణించి.. అనాధలైన పిల్లలకు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఇక పూర్తి విషయాలు కూడా ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

భారతదేశంలో అపార ప్రాణనష్టాన్ని కలిగించింది కరోనా.. ఇక కరోనా కారణంగా తల్లిదండ్రులను,  సంరక్షకులను కోల్పోయిన ఎంతోమంది పిల్లలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపింది. ఇక ఈ క్రమంలోనే అనాధలైన ఆయా పిల్లలకు ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాన మోడీ సంకల్పించినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి సహాయాన్ని అందించనున్నారు. ఇక ఈ పథకం లో భాగంగా  2020 మార్చి 11వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో ఎవరైతే కరోనా కారణంగా సంరక్షకుల ను,  తల్లిదండ్రులను లేదా ఒంటరి తల్లిని,తండ్రిని కోల్పోయిన పిల్లలకు పి ఎమ్ కేర్స్ కింద సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యంగా స్కాలర్ షిప్ .. భారత వైద్య బీమా కార్డులు.. పీఎం కేర్ పాసు పుస్తకాలను కూడా ఈరోజు నుంచి అందించనున్నట్లు తెలిపారు. ఇక బాధిత పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వారి పేరు మీద పది లక్షల రూపాయలు సొమ్మును బ్యాంకులో డిపాజిట్ అయ్యేలా చేస్తామని ప్రకటించారు. ఇక 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఆ డిపాజిట్ పై వచ్చిన వడ్డీని వారికి ఆర్థిక సహాయంగా ఇవ్వడంతోపాటు 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పది లక్షల రూపాయలను పూర్తిగా బాధితులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధిత పిల్లలు తమ వివరాలను నమోదు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మోడీ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో మంది పిల్లలకు అండగా నిలబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: