మనీ: ఈ పథకంతో మీ చిన్నారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దవచ్చు..!!
ఇక అలాంటి వారికోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఇందులో ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు లభించడంతోపాటు ఆడపిల్లల పెళ్లి ఖర్చులు లేదా విదేశాలలో ఉన్నత విద్య లాంటి వాటికి చక్కగా ఈ డబ్బు సహాయపడుతుంది. ఆడపిల్లల జీవితాలను మెరుగు పరిచే దిశగా 2015 జనవరి 22వ తేదీన మోడీ ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం 7.6 శాతం ఇవ్వడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం చివరిలో ఖాతాలో వడ్డీ డబ్బులు జమ చేయబడుతుంది. ఇక ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకం పై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు.
ఇక 10 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న బాలికల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంకు లో అయినా సరే ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ ఖాతా తెరవబడుతుంది. ఇక కనీసం 250 రూపాయలు ప్రతి నెలా డిపాజిట్ చేయడం వల్ల సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మంచి లాభాలను పొందవచ్చు కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా లభించే డబ్బుతో ఆడపిల్లకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత డబ్బు మొత్తం తీసుకోవచ్చు.