మనీ: తక్కువ పెట్టుబడితో ఎక్కువ పింఛన్.. !!

Divya

ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాల కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ఈ పథకం కింద ఎన్రోల్మెంట్లు 2022 మార్చి సంవత్సరం నాటికి 4.01 కోట్లు దాటినట్లు సమాచారం. ఇకపోతే 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను 99 లక్షలకుపైగా అటల్ పెన్షన్ యోజన ఖాతాలో తెరిచినట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు వార్షిక లక్ష్యాన్ని సాధించాలి అని కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. అటల్ పెన్షన్ యోజన పథకం చందాదారులకు 60 యేళ్లు దాటిన తర్వాత రూ. 5000 పింఛన్ కూడా అందజేస్తుంది.
సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ మద్దతుతో ఫుల్ సెక్యూరిటీ స్కీం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. 2022 మార్చి 31వ తేదీ నాటికి అటల్ పెన్షన్ యోజన పథకం కింద చాలామంది ఎన్రోల్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో 58 శాతం పురుషులు ఉన్నట్లుగా సమాచారం. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఎక్కువగా ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్లు 44 శాతం మహిళ సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు.
ఇక ఇందులో రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000  పెన్షన్ పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి నెల మీరు కట్టే ప్రాతిపదికన వచ్చే పెన్షన్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ఎంత పెన్షన్ 60 సంవత్సరాల తర్వాత కావాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మీరు ప్రతి నెల పెట్టుబడిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పథకాల ద్వారా భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఇందులో పెట్టుబడిగా పెట్టడం అలవాటుగా చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: