మనీ: నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందాలంటే ఇలా చేయండి..!!

Divya
భారతదేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరి ని దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కొత్త పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇక పోతే ఈ రోజు కూడా ప్రతి వర్గాల వారికి ఇన్సూరెన్సు పాలసీలను అందించడం కోసం సరికొత్త పథకాన్ని తీసుకు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల వంద సంవత్సరాల వరకు బీమా రక్షణ కూడా పొందవచ్చు. అయితే ఈ పాలసీ ఏమిటంటే ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ఉమాంగ్ పాలసీ.. ఇది ఒక ఎండోమెంట్ పాలసీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత భారీ మొత్తంలో మీకు ప్రయోజనాలను కలిగిస్తుంది జీవన్ ఉమాంగ్ పాలసీ.
బిడ్డ పుట్టిన 90 రోజుల వయసు నుంచి 55 సంవత్సరాల వరకు ఈ పాలసీ తీసుకునే వెసులుబాటు కల్పించింది. మీకు జీవిత బీమా కవరేజీ అందించడమే కాకుండా పూర్తయిన తర్వాత పెద్ద మొత్తాన్ని కూడా ఎల్ఐసి అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఒక వ్యక్తి  వంద సంవత్సరాల లోపు మరణిస్తే ఈ పరిస్థితుల్లో డిపాజిట్ మొత్తం నామినికి చెందుతుందని ప్రకటించడం జరిగింది. ఇక ఈ పాలసీ కాలవ్యవధిని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంచుకోవచ్చు.ముఖ్యంగా ఈ పాలసీలో పెట్టుబడిదారుడు కనీసం 2 లక్షల రూపాయల వరకు ఆమె మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి వృద్ధాప్యంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు 43 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే నెలకు 1302 రూపాయలను పెట్టుబడిగా పెట్టాలి. ఆశ్చర్యానికి ప్రీమియం 15298రూపాయలు అవుతుంది. 30 సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకున్నట్లు అయితే డిపాజిట్ మొత్తం రూ. 4.58 లక్షలు అవుతుందట. అంటే మీరు మీరు ప్రతి నెల 3333 రూపాయలను పెన్షన్ కింద ప్రతి ఈ సంవత్సరం మీకు 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు పొందవచ్చు. ఒకవేళ 100 లోపు మరణిస్తే ఇస్తే మీ డబ్బులు మొత్తం నామినీకి చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: