మనీ: ఆస్తులు కొనుగోలు చేసే వారికి శుభవార్త..!

Divya
ఇటీవల కాలంలో స్థలం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి . సామాన్యుడు తన ఆస్తిని పెంపొందించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం కుదరడంలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సొంతంగా ప్రాపర్టీ లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక మామూలు ఆదాయం వచ్చే ఉద్యోగులు సైతం సొంతంగా ఆస్తులు కొనుగోలు చేయాలని ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇక అందులో భాగంగానే బ్యాంకులో లోన్ తీసుకుని మరీ తమ కలలను నెరవేర్చుకుంటున్నారు.
మీరు కూడా బ్యాంకులలో లోన్లు తీసుకొని ఆస్తులను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే అలాంటి వారికి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక మెగా వేలానికి సంబంధించిన ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ వేలం లో పాల్గొని తక్కువ ధరకే మీరు ప్రాపర్టీ లను సొంతం చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ఆధారంగా ప్రాపర్టీ లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించబడింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించనున్న ఈ వేలంలో రిజర్వు ప్రైస్ రూ.5.4 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది.
మీరు ఈ వేలంలో పాల్గొనడానికి కంటే ముందే ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీ లు ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ఎంత ఉందో కూడా తెలుసుకొని కొంటే మీకు లాభం చేకూరుతుంది. అంతేకాదు వేలంలో పాల్గొనే వారికి లోన్ సదుపాయాన్ని కూడా అందించడానికి సిద్ధమైనది బ్యాంకు అఫ్ బరోడా. ఇక మీకు సరిపడినంత డబ్బులు లేకుండా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే లోన్ తీసుకొని మరి ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. తాజాగా అందుకు సంబంధించిన ట్వీట్ ను  కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేయడం జరిగింది. ఇక బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోతే వారి ప్రాపర్టీ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇలాంటి వేలం లో పాల్గొని ప్రాపర్టీ లను కొనుగోలు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ లను కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: