పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ.. అలాంటి బిజినెస్ ఏంటో తెలుసా..?
ఇకపోతే ఆవాల నుంచి వేరుశెనగ వరకు.. కొబ్బరి నుంచి ప్రొద్దుతిరుగుడు వరకు వివిధ రకాల నూనెలను ఉత్పత్తి చేసే చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారానికి మీకు కావలసింది ముఖ్యంగా ఎక్స్ పెల్లర్ ఆయిల్ మెషిన్ మాత్రమే అవసరమవుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు సుదీర్ఘకాలంపాటు లాభాలను ఈ బిజినెస్ ద్వారా మీరు పొందవచ్చు. ముందుగా ఎలాంటి ఆయిల్ మిల్లు వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో ఆలోచించి ఎలాంటి నూనెను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు అందుకు తగ్గట్టుగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఆవాల నూనె తీసే మిల్లు అయితే ఖరీదు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది. తరువాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మీరు లైసెన్స్ పొందాలి.
పూర్తిస్థాయిలో ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెడతారు కాబట్టి దీర్ఘకాలం లాభం పొందవచ్చు ముఖ్యంగా డబ్బాలు లేదా సీసాలలో ప్యాక్ చేసి కస్టమర్లకు కూడా సేల్ చేయవచ్చు. కొద్ది నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుంది.