మనీ: నెలకు రూ.1000 ఆదా.. కోటీశ్వరులు అయ్యే అవకాశం..!
ప్రస్తుతం ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు వీలైనంత త్వరగా కోటీశ్వరులు అయ్యేఆస్కారం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి..? ఏది ఎంచుకోవాలి ..? అనే విషయం గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి.మ్యూచువల్ ఫండ్ పథకాలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఒకటి. ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున మీరు దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు వెయ్యి రూపాయల చొప్పున 30 సంవత్సరాల పాటు ఆదా చేసినట్లయితే రూ.70 లక్షలకు పైగా రిటర్న్స్ వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
అంతేకాదు ప్రతి ఏడాది 15 శాతం చెప్పున రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు స్టెప్ అప్ సిప్ అనే ఫీచర్ ను అందిస్తున్నాయి.ఇక మీరు మొదటి సంవత్సరం నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే 5% ప్రతి సంవత్సరం స్టెప్ అప్ సిప్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక 5% స్టెప్ అప్ సిప్ ను రెండవ సంవత్సరం మీ పొదుపు 1,050 రూపాయలు చొప్పున ఇన్వెష్ట్ చేయాల్సి ఉంటుంది. 10% స్టెప్ అప్ సిప్ ను పెంచుకుంటే రెండవ ఏడాది రూ.1,100 ఇన్వెష్ట్ చేయాల్సి ఉంటుంది.
కోటీశ్వరులు ఎలా అవ్వాలి అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మ్యూచువల్ ఫండ్ లో పది శాతం స్టెప్ అప్ సిప్ ను ప్రారంభిస్తే మ్యూచువల్ ఫండ్ రిటర్న్ 15శాతం లభిస్తుంది. ఇదే పద్ధతిలో 30 సంవత్సరాలపాటు పొదుపు చేసినట్టు అయితే రూ.1,30,00,000 రిటర్న్స్ వస్తాయి.