మనీ: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న వారికి కొత్త వడ్డీ రేట్లు ఏంటో తెలుసా..?
ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కు అధిక లాభాలు ఉండడం ఉన్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకు డిపాజిట్ల పై వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేయడం జరిగింది.. గత కొన్ని రోజులుగా ఐ సి ఐ సి ఐ, ఎస్ బి ఐ, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు డిపాజిట్ల పై వడ్డీ రేట్లు సవరించి అందరికీ శుభవార్త ను తీసుకొచ్చాయి. ఇక డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆదాయం కూడా లభిస్తుంది. కాబట్టి అది కూడా ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లను అందించడం జరిగింది.
ఇక ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు కూడా సరికొత్తగా వడ్డీ రేట్లు ను సవరించడం జరిగింది. ఇకపోతే వడ్డీ రేట్లు రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లకు వర్తించదు. 18 నెలల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధిలో ప్రాజెక్టులకు 5.25 శాతం వడ్డీ రేటును అందివ్వడం గమనార్హం. సవరించిన వడ్డీ రేట్ల విషయానికి వస్తే రెండు కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారు ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకు సాధారణ వినియోగ దారులకు..2.50 స్వాగతం లభించగా సీనియర్ సిటిజన్స్ కు 2.90 శాతం వడ్డీ లభిస్తుంది.
30 నుంచి 90 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3 శాతం ఉండగా సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ రేట్లు ఇవ్వనున్నారు. ఇక 91 రోజుల నుంచి 120 రోజుల వరకూ సాధారణ కస్టమర్లకు అయితే 3.50 శాతం ఉండగా సీనియర్ సిటిజన్స్ 4 శాతం వడ్డీ రేట్లు సవరించడం జరిగింది.ఇక 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ సాధారణ కస్టమర్లకు 4.40 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్స్ కు 4.90 శాతం వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్లకు సాధారణ కస్టమర్లకు 5.45 శాతం, సీనియర్ సిటిజన్స్ కు 5.95 శాతం ఇలా వడ్డీ రేట్లు సవరించడం జరిగింది.