మనీ: వడ్డీ రేట్లు పెంచుతూ ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

Divya
దేశంలోని దిగ్గజం బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు అతిపెద్ద గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమారుగా రూ.రెండు కోట్లకు పైగా ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారో అలాంటివారికి వడ్డీరేట్లను 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గా స్టేట్ బ్యాంకు వెల్లడించింది. 2022 మార్చి 10వ తేదీ నుంచి పెంచిన ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.. 211 రోజుల నుంచి సంవత్సరం కంటే తక్కువ వ్యవధి ఉన్న వాళ్లు రూ. రెండు కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అలాంటి ఖాతాలపై వడ్డీ రేట్లకు 20 బేసిస్ పాయింట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.

ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.20 శాతం వడ్డీ ఉంది.. దానిని ఎస్బిఐ తీసుకున్న నిర్ణయంతో 3.30 శాతానికి పెరగనుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.6 శాతంగా ఉండగా దానిని 3.8 శాతానికి పెంచింది. సంవత్సరం నుంచి పది సంవత్సరాల టెన్యూర్ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే వడ్డీ రేట్లు 3.10 శాతం నుంచి దానిని ఇప్పుడు 3.60 శాతానికి పెంచడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 4.10 శాతం వరకు వడ్డీని పొందవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
2 ఏళ్ల నుంచి 3 యేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచి 5.20 శాతానికి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ఇక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ గడువు ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఇలాంటి డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీని మీరు పొందవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో  మొత్తంగా 5.50 శాతానికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: