మనీ: అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేసే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లు.. ఫిక్స్డ్ డిపాజిట్ లతో పోలిస్తే ఎక్కువగా రిటర్న్స్ అందిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. రిస్కు కూడా ఉండదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లకు బ్యాంకులో మద్దతు ఉన్నప్పటికీ ఇందులో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ వలె వడ్డీ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండవు. పోస్ట్ ఆఫీస్ లో కూడా చక్కటి ఆర్థిక ప్రణాళిక తో మీరు ఉత్తమ పథకాలను ఎంచుకుని డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడిని కూడా అందుకోవచ్చు. అయితే తక్కువ రిస్కుతో మంచి రిటర్న్స్ అందించే పెట్టుబడులు అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తుకువస్తాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేసే పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇక అలాంటి వాటిలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒకటి. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ తో పోలిస్తే ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో రిటర్న్స్ లభిస్తాయి. అది కూడా తక్కువ రిస్కుతో కూడి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ స్కీం లకు ప్రభుత్వం మద్దతు కూడా లభిస్తుంది. ఇక అందుకే 5.5 నుంచి 7.6 శాతంగా వడ్డీ రేట్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి పోస్టాఫీసులు. ఇక ఈ విధంగా అధిక వడ్డీ రేట్లతో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ లో పన్ను బాధ్యతను కూడా తగ్గించడం గమనార్హం.
సుకన్య సమృద్ధి యోజన:
ఆడపిల్లలను ఉద్దేశించి ప్రవేశపెట్టినది అంటే పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు ఈ పథకంలో ఖాతాను ఓపెన్ చేయవచ్చు ఇక దీని ద్వారా 7.6 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. కనిష్టంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మనం ఖాతాను గనుక ఓపెన్ చేస్తే 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఈ ఖాతాలో చేరే అవకాశం ఉంటుంది. ఇక గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: