మనీ: పీఎఫ్ ఖాతా ఉన్న వారికి శుభవార్త.. ఏమిటంటే..?

Divya
ఇక పీఎఫ్ ఖాతా ఉన్న వారు ఎవరైనా సరే డబ్బు అవసరం చాలా ఉంటే కేవలం గంటలోనే పీఎఫ్ ఖాతా నుంచి ఏకంగా లక్ష రూపాయలను విత్డ్రా చేసుకోవచ్చు.. దీనినే అడ్వాన్స్ పీఎఫ్ బ్యాలెన్స్ అని అంటారు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి లక్ష రూపాయలు విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది ఈపిఎఫ్ఓ సంస్థ. మెడికల్ ఎమర్జెన్సీ అనిపించినప్పుడు ఏ సమయంలోనైనా సరే ఈ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ డబ్బు అవసరమైతే కేవలం గంటలోనే ఈ పీఎఫ్ ఖాతా ద్వారా డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు.
అయితే ఇందుకోసం ఎమర్జెన్సీ అవసరాలకు సంబంధించి.. హాస్పిటల్లో చేరినట్టు ప్రూఫ్ లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల నిధులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించడం గమనార్హం.. కరోనా వైరస్ మాత్రమే కాకుండా మరేదైనా సరే మెడికల్ ఎమర్జెన్సీ కింద మీరు కనుక హాస్పిటల్లో చేరినట్లు అయితే వెంటనే ప్రూఫ్ లు సబ్మిట్ చేసి పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు.
ఇకపోతే గతంలో కూడా ఈపీఎఫ్ఓ మెడికల్ ఎమర్జెన్సీ కోసం పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది కానీ అప్పుడు కేవలం మెడికల్ బిల్లులు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే మనకు డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే ఇందుకు కావలసిన ప్రూఫ్ లను సబ్మిట్ చేస్తే వెంటనే మీ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక మీరు covid 19 టాబ్ కింద ఆన్లైన్ అడ్వాన్స్ క్లైమ్ కింద ఖాతా నుంచి లక్ష రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ ఏమిటంటే www.epfindia.gov.in వెబ్ సైట్ ను సందర్శించి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

PF

సంబంధిత వార్తలు: