మనీ: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. రూ.లక్షకు..రూ.21 లక్షలు..!!

Divya
ప్రస్తుతం చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి షేర్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ మార్కెట్ లో డబ్బులు పెడితే త్వరగా రెట్టింపవుతాయి అన్న కారణంతోనే రిస్క్ ఉన్నప్పటికీ చాలా మంది ధైర్యం చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే షేర్ మార్కెట్ లో ఉండే రిస్క్ వల్ల ఒక్కోసారి పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. ఇకపోతే ఒక్కో షేర్ మాత్రం ఒక్కో రాబడిని అందిస్తుంది అనే విషయం గుర్తు చేసుకోవాలి. అయితే మనం ఎంచుకునే షేర్ ను బట్టి మనకు వచ్చే లాభాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో షేర్లను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఎంచుకోవడం తప్పనిసరి.

ఇకపోతే కేవలం ఒకే ఒక్క షేర్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంటే ఏడాది కాలంలోనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి వుంటే అది కాస్తా రూ.21 లక్షలకు చేరుకోవడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్లో ఈ  షేర్ ధర రూ.209 వుండగా.. ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.815 కు చేరుకుంది. సరే అయితే కేవలం మూడు నెలల్లోనే ఇలా ఇంత రేటు పెరగడానికి గల కారణం ఏమిటంటే.. జీఆర్ఎం ఓవర్సీస్.. కంపెనీ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఉడాన్ ఇండియా తో భాగస్వామ్యం కుదుర్చుకోవడమే  ఇందుకు ప్రధాన కారణం. ఇక అందుకే ఈ షేరు ధర కూడా బాగా పెరిగిపోయింది.

ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధర చూసుకుంటే ఏడాది కిందట కనుక ఈ షేర్ మార్కెట్లో మీరు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే ప్రస్తుతం దాని విలువ అక్షరాల 21 లక్షల రూపాయలు. అయితే షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే టప్పుడు కంపెనీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇక షేర్ మార్కెట్ నిపుణులను సంప్రదించి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో తెలుసుకొని మరీ ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: