మనీ: కొత్త సంవత్సరం మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే వ్యాపారాలు..!!

Divya
ఎప్పటికప్పుడు మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తూ తమకంటూ సొంత డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ కొత్త సంవత్సరం మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆర్థిక భరోసా ఇచ్చే కొన్ని వ్యాపారాలు లేదా ఉద్యోగాల గురించి మనం తెలుసుకుందాం.
1. బ్యూటీ పార్లర్:
అమ్మాయిలు అన్నం లేకుండా అయినా సరే ఉండగలరేమో కానీ పార్లర్ కి వెళ్ళకుండా అయితే అస్సలు ఉండలేరు. అందుకే ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా ఈ బ్యూటీపార్లర్లు పుట్టుకొస్తున్నాయి. రోజు రోజుకి వీటికి డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో హెయిర్ స్టైల్స్,  మేకప్ , ఫేషియల్స్ వంటివి చిన్న చిన్న పద్ధతులు నేర్చుకుంటే బ్యూటీపార్లర్ ద్వారా కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. ఇక దీనికి కొత్తగా షాప్ అవసరం లేదు.. ఇంట్లో ఉంటూనే బ్యూటీ పార్లర్ మొదలుపెట్టవచ్చు.
2. ఈవెంట్ మేనేజర్:
అలంకరణలో అమ్మాయిలకు మించినవారు ఎవరూ లేరు అని చెప్పాలి. ఈవెంట్ మేనేజర్ గా వివాహ వేడుకలకు, పుట్టిన రోజులకు, పుష్పవతి ఫంక్షన్ లకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే ఈవెంట్ ను చక్కగా నిర్వహించడం కోసం  ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరగడానికి లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు.కాబట్టి అలాంటి పార్టీలను ప్లాన్ చేసి మంచిగా ఈవెంట్స్ చేస్తే.. రాబడి కూడా అంతే వస్తుంది.

బేకరీ:
ఆడవాళ్లు చేయలేని పని ఏదీ లేదు అంటూ ఈ బేకరీ ద్వారా కూడా నిరూపించవచ్చు. నాణ్యమైన కేకులు తయారు చేసి మార్కెట్లో అమ్మడం వల్ల క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా కస్టమర్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కేకులు తయారు చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు.
వీటితోపాటు డే కేర్ సెంటర్ లతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. మహిళలు ఇలాంటి పనులు గనుక చేసినట్లయితే ఈ కొత్త సంవత్సరం ఆర్థికంగా మెరుగు పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: