మనీ: హెచ్ డీ ఎఫ్ సీ నుంచి అదిరిపోయే సరికొత్త పథకం..!!

Divya
ప్రస్తుతం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఏదైనా ఒక సరికొత్త ప్లాన్ ను తీసుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీకు ఒక చక్కటి శుభవార్త తీసుకువచ్చింది హెచ్డిఎఫ్సి... ఇందులో మీరు ప్రతినెల ప్రీమియం చెల్లించడం వల్ల రిటైర్మెంట్ తరువాత జీవితాంతం డబ్బులను ప్రతి నెలా పెన్షన్ రూపంలో పొందవచ్చు.. ఇందుకోసం మీరు ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ తీసుకున్నట్లయితే కొన్ని విషయాలను కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటికీ ఎన్నో పథకాలు అందుబాటులోకి వచ్చినా..ఇప్పుడు మరో సరికొత్త పథకం అందుబాటులోకి రావడం గమనార్హం. హెచ్డిఎఫ్సి లైఫ్ తాజాగా ఒక రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది.

ఇక ఈ సరికొత్త రిటైర్మెంట్ ప్లాన్ పేరు సిస్టమేటిక్ రిటైర్మెంట్ ప్లాన్. ఇది ఇండివిజువల్ , నాన్ పాటిస్పేటింగ్ , గ్రూప్ , నాన్ లింక్డ్ సేవింగ్స్ డిఫర్ట్ యాన్యుటీ ప్లాన్.. రోజు రోజుకి దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది కాబట్టి రిటైర్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి. అయితే ఈ రోజు వున్న రేట్లు మరి కొన్ని రోజుల తర్వాత ఉండవు.. రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే అందుకే భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా తప్పనిసరి. హెచ్డిఎఫ్సి తీసుకొచ్చిన సిస్టమేటిక్ రిటైర్మెంట్ ప్లాన్లో కస్టమర్లు యాన్యుటీ వడ్డీరేట్లను ముందుగానే లాక్ చేసుకునే అవకాశం కల్పించబడింది.
ఇక ఈ స్కీమ్లో చేరాలని భావించే వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక అందులో 15 సంవత్సరాల పాటు ప్లాన్ ను తీసుకోవడం వల్ల మంచి ఆదాయం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి మెడికల్ చెకప్ అవసరం లేకుండా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ప్లాన్ మీరు తీసుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం చెల్లింపు వల్ల జీవితకాలం మీకు ఖచ్చితమైన ఆదాయం కూడా లభిస్తుంది. 45 నుంచి 75 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు ఈ ప్లాన్ కొనుగోలు చేయడం వల్ల మంచి ఆదాయం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: