మనీ: అమ్మాయిలకు ఈ స్కీం తో ఆర్థిక భరోసా ఇచ్చిన కేంద్రం..!!

Divya
సాధారణంగా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అమ్మాయిల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకంలో చేరడం వల్ల అమ్మాయిల పెళ్లిళ్లకు , చదువుల విషయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ పథకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం లో చేరాలనుకునే అమ్మాయిలు కొన్ని విషయాలను గుర్తించుకోవడం తో పాటు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.

ఇకపోతే ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు కాబట్టి అమ్మాయి కి 18 ఏళ్లు నిండగానే కొంత మొత్తంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు 15 సంవత్సరాల పాటు ఈ పథకంలో డిపాజిట్ చేసిన తర్వాత ఏకంగా 65 లక్షల రూపాయలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమృద్ధి యోజన పథకం మీద 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక ఈ పథకంలో మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీరేట్లను మారుస్తుంది కాబట్టి వడ్డీ శాతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యంగా ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.. కనుక ఈ స్కీం లో ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా చేరవచ్చు. 10 సంవత్సరాల వయసు లోపే ఈ పథకంలో చేరాల్సి ఉంటుంది. ఇక భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలి అంటే సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. అంటే రోజుకు 416 రూపాయలు ఆదా చేయడం వల్ల మెచ్యూరిటీ సమయం అనగా 15 సంవత్సరాల ముగిసేసరికి అమ్మాయి చేతికి 65 లక్షల రూపాయలు వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా వెళ్లి మీ కూతురు పేరు పైన ఈ అకౌంట్ తెరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: