మనీ: ఈపీఎఫ్ లో ఇలా చేయకుంటే రూ.7 లక్షలు నష్ట పోవాల్సిందే..?

Divya
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో చాలా మంది డబ్బులు దాచుకున్న విషయం తెలిసిందే.. చందాదారుల కోసం ఏ పీ ఎఫ్ ఓ ఆన్లైన్ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆన్లైన్ సర్వీసులను ప్రవేశ పెట్టిన కారణంగా మీరు చిన్నచిన్న అవసరాలకోసం ఈపీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అందుకోసమే ఈ నామినేషన్ సర్వీస్ పేరిట ఆన్లైన్ లో మనం ఈపీఎఫ్ కు సంబంధించిన చిన్న చిన్న కార్యకలాపాలను పూర్తి చేసుకోవచ్చు.. మీకు కూడా పీఎఫ్ ఖాతా ఉంటే అందులో కచ్చితంగా నామిని పేరును నమోదు చేయించాలి.

లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిఎఫ్ ద్వారా వచ్చే డబ్బులు రావు.. ముఖ్యంగా మీరు ఈపీఎఫ్ నామిని మార్చడానికి పిఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని ఈపీఎఫ్ ఓ ఒక ట్వీట్ చేసింది. ఇప్పుడు తాజాగా పీఎఫ్ అకౌంట్ లో నామిని పేరును ఫైనల్ గా పరిగణిస్తారు కాబట్టి పీఎఫ్ అకౌంట్ కు తప్పనిసరిగా నామిని జత చేయాల్సి ఉంటుంది. నామిని పేరు జత చేయకుండా ఉండడం వల్ల..పీఎఫ్ డబ్బులు ఖాతాదారుడు మరణిస్తే రావని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.
 
ఉద్యోగులకు వివిధ రకాల సర్వీసులను సులభతరం చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నామినేషన్ పేరు చేర్చేందుకు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి మనం వెళ్ళకుండానే ఆన్లైన్లో సేవలను పొందవచ్చు. ఇక ఈ - నామినేషన్ చేయడం వల్ల ఖాతాదారుడు మరణిస్తే నామిని కి ఏడు లక్షల రూపాయల వరకు వస్తాయి. ఇందుకోసం మీరు ఈపీఎఫ్ ఓ అధికారిక పోర్టల్ లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. యూ ఏ ఎన్ , పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి ఈ-  నామినేషన్ చేయకపోతే.. ఈ నామినేషన్ పై క్లిక్ చేయండి. ఓటీపీ జనరేట్ చేయడం కొరకు ఈ సైన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఇక తర్వాత ఈ నామినేషన్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా ఈ - నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: