మనీ: ఆర్బీఐ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ. 40 లక్షలు మీవే..!

Divya
దేశీయ కేంద్ర బ్యాంకు గా గుర్తింపు పొందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక శుభవార్త ను తీసుకొచ్చింది. మొదటిసారి గ్లోబల్ హ్యాకథాన్ HARBINGER 2021 ను ప్రకటించడం జరిగింది. స్మార్టర్ డిజిటల్ పేమెంట్ థీమ్ తో ఆర్ బీ ఐ దీనిని తీసుకు రావడం జరిగింది. ఈ కాంపిటీషన్ లో గెలిచిన వారికి సుమారుగా 40 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీ లభిస్తుంది అని ఆర్బిఐ ప్రకటించడం గమనార్హం.
ఎవరైతే ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలని అనుకుంటున్నారో అలాంటి వారు మొత్తం నాలుగు సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఆ సమస్యలేమిటో ప్రస్తుతం మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..
1. చిన్న చిన్న మొత్తంలో డబ్బును లావాదేవీలు జరిపేటప్పుడు డిజిటల్ మోడ్ లోకి మార్చడానికి సులభంగా ఉపయోగపడే కొన్ని కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉంటుంది. అంటే నాన్ మొబైల్ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న మాట.
2. లావాదేవీలకు సంబంధించి యూజర్ల ప్రమేయం లేకుండా సమయం, సందర్భానికి తగినట్టుగా రిటైల్ చెల్లింపులు ఉండేలా వినూత్న ఆవిష్కరణలు చేయాలి.
3. డిజిటల్ పేమెంట్ లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త అథంటికేషన్ ప్రక్రియను చేపట్టాలి.
4. అంతే కాదు ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించేటప్పుడు మోసాలు జరగకుండా ఉపయోగపడే ఒక అద్భుతమైన టూల్ ను తీసుకురావాలి. అంటే అనాలసిస్ మానిటరింగ్ టూల్ ను పొందుపరచడం తప్పనిసరి.
ఈనెల 15వ తేదీ నుంచి కాంపిటీషన్ మొదలవుతుంది కాబట్టి తప్పకుండా ఈ కాంపిటీషన్ లో పాల్గొని విజేతగా నిలవాలని ఆర్.బి.ఐ సూచిస్తోంది. అయితే ఇందులో మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే https://hackolosseum.apixplatform.com/hackathon/harbinger2021 ఈ లింకు ద్వారా మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి 40 లక్షల రూపాయలు అందిస్తారు..అదే రన్నరప్ గా నిలిచిన వారికి 20 లక్షల రూపాయలను ప్రైజ్ మనీ కింద అందిస్తామని ఆర్బిఐ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: