మనీ: నెలకు రూ.231 కడితే..నెలకు రూ.2 వేలు పెన్షన్..!!

Divya
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వృద్ధుల కోసం అలాగే అట్టడుగు వర్గాల వారి కోసం సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల రెండు వేల రూపాయలను అందిస్తుంది.. అయితే అలా మనకు ప్రతి నెల రెండు వేల రూపాయల రూపంలో పెన్షన్ వచ్చే పథకం గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఆ పథకం ఏదో కాదు అటల్ పెన్షన్ యోజన పథకం.
సాధారణంగా వృద్ధాప్యంలో ఆదాయం లేక వృద్ధులు ఎన్నో అవస్థలు పడుతున్న రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనము కూడా వృద్ధాప్యంలో ఇబ్బంది పడకూడదు అంటే ఇప్పటి నుంచే అటల్ పెన్షన్ యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి. అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది .. ఇది 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకు ఎంత లభిస్తుంది.. అనే విషయాలను కూడా మనం ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం..
ఈ పథకంలో చేరాలనుకుంటే మీ స్మార్ట్ ఫోన్ లో ఏపీవై యాప్ ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, ఈ యాప్ లో మీ పేరు మీద రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఇక ఇందులో రిజిస్టర్ కావాలంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అంతేకాదు కేవైసీ కంప్లైంట్ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తప్పకుండా తీసుకోవాలి. వీటన్నింటితో మీ పేరు పైన అటల్ పెన్షన్ యోజన పథకం లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రతి నెల డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ప్రస్తుతం మీరు ఎంత డబ్బులు కడుతున్నారు అనే విషయంపై మీకు వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
మీరు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల రెండు వేల రూపాయలను పెన్షన్ కింద పొందాలి అనుకుంటే, ఇప్పుడు ప్రతి నెల 231 రూపాయలు కట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: