మనీ: ఇకపై ఆధార్ ఈ కేవైసీ తో ఈ స్కీం ద్వారా ప్రతినెల రూ.5 వేలు మీ సొంతం..!!

Divya
సరికొత్త పథకాలలో చేరుతూ తక్కువ సమయంలో డబ్బులు పొందాలి అని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి తీపికబురు తీసుకొచ్చింది.. ఎవరైతే అటల్ పెన్షన్ యోజన పథకం లో చేరాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ శుభవార్త ఎంతో ఊరటనిస్తుంది.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA తాజాగా అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించి ఆధార్ ఈ కేవైసీ సర్వీస్ ను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన పథకం కింద ఒక అకౌంట్ ని ఓపెన్ చేయాలని అనుకుంటే, వారికి ఇది చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు.. అయితే కేవలం ఆధార్ కార్డు ఉంటే మీరు సులభంగా ఈ పథకంలో చేరడానికి అర్హులు. భారతదేశంలో పౌరుడిగా జీవించాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉండాల్సిందే.. కాబట్టి ఇప్పుడు అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉంటున్నాయి.. ఇక ఇలాంటి వారందరూ ఈ పథకంలో సులభంగా చేరవచ్చు.. ఈ పద్ధతి ప్రవేశపెట్టక ముందు ఈ పథకంలో చేరాలి అనుకుంటే తప్పకుండా బ్యాంకు బ్రాంచ్ కైన వెళ్లాలి లేదా ఇతర మార్గాలలో చేరాల్సి ఉంటుంది.

ఈ పథకం ద్వారా పొందే ప్రయోజనాలను అందరికీ చేరువ చేయాలన్న కాన్సెప్టుతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ పథకం లో చేరడానికి వీలు గా ఏపీవై స్కీం నియమాలను సవరించాము  అని పీ ఎఫ్ ఆర్ డీ ఏ తెలిపింది. ఇప్పటికే ఈ పథకంలో చేరిన వారు కూడా ఆధార్ నంబర్ కు  ఏపీవై అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. ఇక 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఈ పథకం లో ఆధార్ కార్డు ద్వారా సులభంగా చేరవచ్చు. ఇక వయసు, పింఛన్ డబ్బులు మీరు చెల్లించాల్సిన మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. 60 యేళ్లు దాటిన తర్వాత వేయి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ కింద పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: