మనీ: జీవిత బీమా ఎన్ని రకాలు.. అందులో ఏది బెటరో తెలుసా..?

Divya
సాధారణంగా ఈ మధ్య కాలంలో జీవితబీమా పాలసీ ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సూచిస్తున్నాయి. అయితే సాధారణంగా కొన్ని కుటుంబాలు ఒకరిపై మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటాయి..ఒకవేళ ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబాలకు ఆసరాగా ఉండడం కోసమే జీవిత బీమా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అయితే జీవిత బీమా ఎన్ని రకాలు.. అందులో ఏది బెటర్ అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
1. పూర్తిస్థాయి జీవిత బీమా పాలసీ:
జీవితం మొత్తానికి మనకు లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి నెల పది సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించడం వల్ల డబ్బు పొదుపు అవడంతో పాటు జీవిత బీమా కూడా వర్తిస్తుంది.అంతేకాదు ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే పూర్తి బీమా డబ్బులు అలాగే పొదుపు చేసిన డబ్బు మొత్తం నామినికి చెందుతాయి. అంతేకాదు ఈ పథకం  లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాల వ్యవధి తర్వాత పెన్షన్ కూడా మనం అందుకోవచ్చు.
2. మనీ బ్యాక్ పాలసీ:
ఇందులో  పాలసీ తీసుకోవడం వల్ల నిర్దిష్ట కాలవ్యవధి కంటే ముందే సగం డబ్బులను చెల్లిస్తారు. ఇక బీమా జీవిత కాలం అయిపోయిన తర్వాత మిగతా సగం డబ్బులను చెల్లించడం జరుగుతుంది ఒకవేళ పాలసీదారుడు మరణం పొందితే, పాలసీ తర్వాత మిగిలిన డబ్బులను మాత్రమే నామినికి ఇవ్వబడతాయి. ఇక పాలసీదారుడు బతికున్న సమయంలో  ముందే డబ్బులు చెల్లించి ఉంటారు కాబట్టి వాటిని నామినికి ఇవ్వడం జరగదు. అంతేకాదు నెలవారి రూపంలో పాలసీదారుడు బతికుంటే పెన్షన్ రూపంలో డబ్బులు అందుకోవచ్చు.
3. ఎండోమెంట్ బీమా పాలసీ, 4.యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ , 5.టర్మ్ ప్లాన్.. ఇలా ఐదు రకాల పాలసీలు మనకు జీవిత బీమా పథకాల కింద అందుబాటులో ఉంటాయి. కాబట్టి  జీవితకాలం ఉపయోగపడే పాలసీని తీసుకొని డబ్బులు పొందవచ్చు. ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ తీసుకోవడం అత్యవసరం. ఇక మనీ బ్యాక్ పాలసీ తీసుకోవడం వల్ల కూడా కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: