మనీ: డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి వస్తుందో తెలుసా..?

Divya
 
సాధారణంగా చాలా మంది డబ్బులు అధిక మొత్తంలో పొందాలి అంటే, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులు ప్రవేశపెట్టిన పథకాలలో డబ్బు లు  దాచేయాలని చూస్తూ ఉంటారు.. మరి కొంతమంది డబ్బులను బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి  వదిలేస్తే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు.. ఇలా చేసేముందు ఒకసారి ఈ విషయాలను కూడా తెలుసుకోండి..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు సంస్థలు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి.. తమిళనాడు ట్రాన్స్ పోర్ట్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అనేవి  ఈ రెండు సంస్థలు.. వీటిలో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల 8.5 శాతం వరకు మనకు వడ్డీ కూడా లభిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు గా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం వరకు మాత్రమే మనకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఇక పోస్టాఫీసులో అయితే టర్మ్ డిపాజిట్ కింద 6.7 శాతం వరకు వడ్డీని పొందవచ్చు.. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కంపెనీలలో  డబ్బులు పెట్టడం వల్ల 8.5% వరకు మనకు వడ్డీ లభిస్తుంది.. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే,  ఇందులో ఎటువంటి రిస్క్ ఉండకపోగా బ్యాంకులు, పోస్టాఫీసులు ప్రవేశపెడుతున్న వడ్డీ శాతం కంటే ఎక్కువ మొత్తంలో మనం పొందవచ్చు.. ఇక అంతే కాదు సీనియర్ సిటిజన్స్ కు  7.25 శాతం నుంచి 8.5 శాతం వరకు వడ్డీ వస్తోంది.
కాకపోతే మీరు ఎంచుకునే ప్రాతిపదికన వడ్డీ మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మీరు కావాలంటే ప్రతినెలా వడ్డీని పొందవచ్చు లేదా ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో అసలు తోపాటు వడ్డీని కూడా కలిపి తీసుకోవచ్చు.. పూర్తి వివరాల కోసం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: