మనీ : ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు మీ దరిచేరవట..!

Divya
నిజ జీవితంలో ఎవరు ఎంత సంపాదించినా సరే ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని తూచా తప్పకుండా పాటిస్తేనే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం కూడా ఒకసారి చదివి తెలుసుకుని ధనవంతులు అవడానికి ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా కొంతమంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ తక్కువ ఖర్చు చేయాలని ఆలోచిస్తారు. కానీ ఏమాత్రం వారు డబ్బును ఆదా చేయలేక, డబ్బులు నీళ్లలా వృధా చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ నేపథ్యంలోనే చాలామంది ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా కూడా డబ్బులు చేతిలో నిలవక,  ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి . అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు..
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కున బరువు పెట్టడం అస్సలు మంచిది కాదట.
అంతేకాదు ఈశాన్యం వైపు బరువు ఎక్కువగా పెట్టినా లేదా చెత్తాచెదారాన్ని అధికంగా ఉంచినా కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. అంతే కాదు దక్షిణదిక్కున యముడు ఉంటాడు కాబట్టి , దక్షిణ దిక్కు వైపు తలుపులు ఉంచకూడదు. ఇలా వుంటే  ఆర్థిక సమస్యలు మరింత బాధిస్తాయి. ఇంటి తలుపు ద్వారాన్ని ఉత్తరం లేదా తూర్పు లేదా పడమర దిక్కుగా ఉండేటట్టు చూసుకోవాలి అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇక ఈశాన్యదిక్కున ఏవైనా పగిలిపోయిన వస్తువులను పెట్టడం, లేదా చీపుర్లు లాంటివి పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలబడటం కష్టం అట. అందుకే ఇక నుంచైనా ఈశాన్యం దిక్కున చెత్తాచెదారం వేయడం, అధికబరువు ఉంచడం, పగిలి పోయిన వస్తువులు పెట్టడం లాంటివి చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహించి, తప్పకుండా మనకు ఆర్థిక సహాయం చేస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: