మనీ : రూ.42 ఆదా చేస్తే.. నెలకు రూ.1000

Divya
డబ్బు ఆదా చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..? ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలి.. అనే ఆలోచనతో ఏం చేయాలో..? తెలియక కొంతమంది వ్యాపారం వైపు పరుగులు తీస్తే , మరికొంతమంది వ్యవసాయం వైపు పరుగులు తీస్తున్నారు. కొంతమంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి, పాలసీల గురించి , తెలుసుకుని వాటిలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు. అయితే ఎవరైతే అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని తెగ ఆలోచిస్తున్నారో, ఇటువంటి వారికోసమే ఇప్పుడు సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాని పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్కీమ్ ఏదో కాదు "అటల్ పెన్షన్ యోజన" పథకం.. ఇప్పటికే ఇందులో రకరకాల సేవింగ్ పథకాలు అందుబాటులోకి వచ్చాయి.. అంటే, ఈ పథకంలో మనం రోజుకు 42 రూపాయలు చొప్పున ఆదా చేయడం వల్ల ,అతి తక్కువ సమయంలోనే, ప్రతినెల వెయ్యి రూపాయలను పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో 18 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల వయసు వరకు అర్హులు.. ఈ పథకంలో  మీరు డబ్బులు చెల్లించే దాన్ని బట్టి మీకు నెల మొత్తం పెన్షన్ కింద రావడం జరుగుతుంది.
మీరు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పథకం లో చేరితే, మీకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ రూపంలో మీకు డబ్బులు అందుతాయి..నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు గరిష్ఠంగా పొందే వీలు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పథకం లో చేరాలని అనుకుంటే, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకం కింద డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.
నెలకు ఐదు వేల రూపాయలను పెన్షన్ కింద పొందాలి అనుకున్నట్లయితే రోజుకు ఏడు రూపాయలు చొప్పున దాచుకుంటూ, నెలకు 210 రూపాయలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత చేతికి ప్రతినెలా ఐదు వేల రూపాయలు పెన్షన్ కింద అందుతాయి. నెలకు నలభై రెండు రూపాయలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల 60 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీ చేతికి వెయ్యి రూపాయల పెన్షన్ కింద లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: