మనీ: వారి కోసమే కేసిఆర్ వినూత్న ఆవిష్కరణ..

Divya
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు.. ఇటీవల గత కొన్ని రోజుల నుంచి దళితుల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే వారి సంక్షేమం పై ఎక్కువ ఫోకస్ పెట్టారు అని కూడా చెప్పవచ్చు. ఇక మిగతా వర్గాల వారి నుంచి విమర్శలు వస్తున్నా కూడా ఆయన అవన్నీ పట్టించుకోకుండా, కేవలం దళితుల సంక్షేమమే ధ్యేయంగా వారికి రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

అయితే మరి కొద్ది రోజుల్లో హుజురాబాద్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో,  హుజురాబాద్ లో ప్రారంభమయ్యే పైలెట్ ప్రాజెక్ట్ కు దళిత బంద్ కు సంబంధించిన విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ, కేసీఆర్ వాటిని తిప్పి కొడుతున్నారే తప్ప, వారికి అందించే సహాయాన్ని మాత్రం మానుకోవడం లేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ,హుజురాబాద్ నియోజకవర్గ పరిధి లోకి వస్తున్న ఎంతోమంది దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు కలిసి, సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది.

అంతేకాదు వీరందరూ కూడా ప్రగతి భవన్ కు తరలిరావడంతో , వీరికి కేసీఆర్ మరొక వరాన్ని కూడా ప్రకటించారు. ఇక వీరి కోసం ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం సుమారుగా రూ.80 వేల కోట్ల నుండి రూ.లక్ష కోట్ల వరకు ఈ పథకానికి కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో, దళిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై దళిత వర్గాల ప్రజలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా అలాగే సామాజిక వివక్షతల నుండి విముక్తి పొందడం కోసమే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దళిత బంధు పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసి, అందులో ఆ వంద మందికి 10 లక్ష రూపాయల చొప్పున స్వయం ఉపాధి కల్పించాలని, కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఎవరైతే ప్రభుత్వ పథకాలను పొందకుండా ఉంటారో , అలాంటి వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. మొదట 119 నియోజకవర్గాల లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఈ పథకం వర్తించేలా చేస్తారని కేసీఆర్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: