మనీ: ఈ స్కీం లో ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు.

Divya
డబ్బు అనేది ప్రతి ఒక్కరికి నిత్య అవసరంగా మారిపోయింది. డబ్బు లేనిదే ఏ పని జరగదు అన్న విషయం ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు. అయితే కొంతమంది డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏదో ఒక స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి నెలా కొంత మొత్తంలో తిరిగి పొందడం ఎంత బాగుంటుందో అని కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది వుంటారు. ఇక అలాంటి వారికోసమే రకరకాల ఇన్వెస్ట్మెంట్  స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల డబ్బులు పొందాలనుకునే వారికి, పోస్ట్ ఆఫీస్ ఒక ప్రత్యేకమైన స్కీం ను  అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఆ స్కీం  యొక్క పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇక పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన సరి కొత్త స్కీమ్ ఏమిటంటే, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం .. ఇందులో చేరడం వల్ల ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. కాబట్టి కనీసం వెయ్యి రూపాయల నుంచి రూ. 4.5 లక్షల వరకూ ఈ స్కీం లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ స్కీమ్లో చేరడం వల్ల ప్రతినెల కొంత మొత్తంలో డబ్బులు పొందవచ్చు.


ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం అయిన  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , తమ కస్టమర్ల కోసం ఎస్బిఐ యాన్యుటీ డిపాజిట్ స్కీం ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 3, 5 ,7, 10 సంవత్సరాల కాలపరిమితితో ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇక ఈ స్కీమ్లో 5.4 శాతం వడ్డీని అందిస్తోంది. ముఖ్యంగా ఈ పథకంలో సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లానింగ్  పథకం ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందవచ్చు.


అంతేకాదు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ ఫండ్స్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకేసారి కాకుండా ప్రతి నెలా కొంత మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: