మనీ: సాధారణ కాగితాన్ని రూపాయిగా మార్చడానికి అయ్యే ఖర్చు..

Divya

డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఒక మనిషి బ్రతకాలన్న లేదా మరణించాడన్న ఒక మనిషి మరణించిన తరువాత దహనం చేయాలని డబ్బు అవసరం. ఇక ఎన్ని చేతులు మారిన డబ్బు విలువ మాత్రం ఎప్పుడూ మారదు. డబ్బు సంపాదించాలంటే నైపుణ్యం కావాలి అది డబ్బులు ఖర్చు చేయాలంటే నిమిషాల్లో పని. మనుషుల మధ్య బంధాన్ని పెంచే ది డబ్బు అదే బంధాన్ని తిరిగి నిలబెట్టాడు కూడా డబ్బు. అలాంటి డబ్బుకు ఈ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణ కాగితం ముక్క ఈ డబ్బు గా మారడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే 2018 గణాంకాల ప్రకారం..
1.10 రూపాయిల నోట్ :
ఒక కాగితం ముక్క ను పది రూపాయల నోటు గా మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 1.01. అంటే ఇంత  ఖర్చు అవుతుంది అన్న మాట. అంటే పది రూపాయల నోటు లో ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అయితే మిగిలేది మాత్రం రూ. 8.99 పైసలు.
2. 20 రూపాయల నోట్:
20 రూపాయల నోట్ ను  ముద్రించడానికి రూ.1 అవుతుంది. అంటే పది రూపాయల నోటు ఖర్చుతో పోల్చుకుంటే దీనికి ఒక పైసా తక్కువ అని చెప్పవచ్చు.
3. యాభై రూపాయల నోటు:
యాభై రూపాయల నోట్ ను  ముద్రించడానికి అయ్యే ఖర్చు రూ.1.01 అవుతోంది. అంటే పది రూపాయల నోటుకయ్యే ఖర్చు యాభై రూపాయల నోటుకు అయ్యే ఖర్చు కావడం గమనార్హం.
4.100 రూపాయల నోటు:
ఈ వంద రూపాయల నోటు ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు రూ .1.51 . 50 రూపాయల నోటు తో పోల్చుకుంటే 50 పైసలు అదనంగా ఖర్చవుతుంది.
5. 200 రూపాయల నోటు:
200 రూపాయల నోట్ ను  ముద్రించడానికి రూ. 2.15 ఖర్చు అవుతుంది.
6. 500 రూపాయల నోటు:
500 రూపాయల నోటును  తయారు చేయడానికి రూ. 2.57 ఖర్చు అవుతుంది.
7.2000 రూపాయల నోటు:
రెండు వేల రూపాయల విలువ గల నోట్ ను ముద్రించడానికి రూ. 4.18 ఖర్చు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: