ఇక కరోనా మహమ్మారి చాలా దారుణంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేసింది. ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా ఉద్యోగస్తులు అల్లాడిపోయారు. ఇక ప్రభుత్వం వివిధ ఆదాయపు పన్ను సమ్మతి కోసం గడువును పొడిగించింది. ఇంకా COVID-19 చికిత్స కోసం ఒక యజమాని ఉద్యోగులకు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, COVID-19 కారణంగా ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులు యజమాని నుండి పొందిన చెల్లింపు అనేది ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది. వివాద్ సే విశ్వస్ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకానికి చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు రెండు నెలల పొడిగించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 31 వరకు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.అది కూడా అదనపు వడ్డీతో కలిపి పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 31 వరకు చెల్లింపులు చేయవచ్చు. పాన్-ఆధార్ లింకింగ్ యొక్క చివరి తేదీని 2021 సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పొడిగించారు.
ఇక కొత్త చివరి తేదీ ఇప్పుడు సెప్టెంబర్ 30, 2021 కి కేంద్ర ప్రభుత్వం పొడింగించినట్లు తెలిపింది. మన ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని జూన్ 25 శుక్రవారం ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ మధ్య పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ఆధార్, పాన్ కార్డు ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానించడానికి చివరి తేదీ పొడిగించబడిన సంగతి తెలిసిందే.ఇదంతా కూడా కరోనా మహమ్మారి వల్ల ఉపశమనం ఇవ్వడానికి గడువును మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించడం జరిగింది.ఇక ఫారం 16 లోని సోర్స్ (టిడిఎస్) సర్టిఫికెట్ వద్ద పన్ను మినహాయింపును యజమానులకు ఉద్యోగులకు ఇవ్వడానికి గడువు జూలై 31, 2021 నుండి జూలై 31 వరకు పొడిగించబడింది.