మనీ : ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించే మార్గాలు..
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక లాక్ డౌన్ ముగిసిన తర్వాత తిరిగి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కూడా చాలామందికి లేదు.ఇక కరోనా కారణంగా కూడా చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కంపెనీలలో ఉద్యోగాలు లేక ఉన్న కంపెనీలు ప్రస్తుత ఉద్యోగాలు తొలగించడంతో పరిస్థితి తీవ్రతరం అవుతోంది. అంతేకాకుండా ఆర్థికంగా ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..
ఇక ఇలాంటి వారి కోసమే ఇంట్లో ఉంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా కష్టపడేతత్వం, నైపుణ్యం ఉండాలే గాని వర్క్ ఫ్రం హోం పేరిట చేసుకుంటూ పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు.. అయితే ఎలాంటి వాటిద్వారా డబ్బులను సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా సోషల్ మీడియా యాప్ లో ఇంస్టాగ్రామ్ కూడా పాపులర్ అవుతోంది. ఇప్పటికే ఇందులో కొన్ని మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక ప్రతి రోజు కొన్ని లక్షల లో పోస్ట్ లు కూడా పెడుతుంటారు. ఇక ఇందులో చేయవలసిందల్లా ఇంస్టాగ్రామ్ మార్కెటింగ్ చేస్తూ ఆయా కంపెనీల ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయాడం అంతే..ఇందులో పనికి తగ్గట్టుగానే కమిషన్ కూడా పొందవచ్చు.
ఇక మరొక మార్గం ఏమిటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టింగ్. ఇక ఆదాయం పరంగా చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో పట్టు ఉండి, కొన్ని వెబ్ సైట్ లకు ఆర్టికల్ రాసి పంపిస్తే, ఇంట్లో ఉంటూనే డబ్బు సులభంగా సంపాదించుకోవచ్చు..
ఇక అలాగే ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్ వేర్ ల పై పట్టు ఉంటే ఇంట్లో ఉంటూనే గ్రాఫిక్ డిజైన్ లు చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు.అలాగే వస్త్ర వ్యాపారం కూడా సోషల్ మీడియా ద్వారా, మీరు ఏవైతే అమ్మకానికి పెట్టాలనుకుంటున్నారో,వాటిని ప్రమోట్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు.. కాబట్టి మీరు కూడా ఇందులో ఏదైనా నైపుణ్యం కలిగి ఉంటే, వెంటనే ఇంట్లో కూర్చొని, మీ తెలివిని ఉపయోగించి కూడా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు..